Brahma Bhavana Jnana Sadhana Satsangamu
అమ్మ జననం – బ్రహ్మోద్భవం
అమ్మ చరితం -బ్రహ్మ జ్ఞానామృతం
బ్రహ్మము ప్రార్ధన :
ఓం ముక్తి కరం , శక్తి మూలం
భవతిమిరహరణం , జ్ఞాన దాయకం
కాలాతీతం , స్వ స్వరూప మార్గదర్శకం
ప్రాణాధారం , గోప్యం అగోచరం
ధ్యానమార్గానం ,సుస్పష్టం
అంతర నివాసం , ఆనంద ప్రదాయకం
అద్వైత మూర్తిం , తమ్ నమామి పరబ్రహ్మమ్
అనగా, ముక్తినిచ్చునట్టి, మానవ స్వరూపానికి మూలమైనట్టి ,భావంలో గల చీకటిని హరింపజేసెడి ,స్వరూప జ్ఞానాన్ని ప్రసాదించెడి, ప్రాణానికి ఆధారమైనది,గోప్యంగా ఉండునది నేత్రాలకుకానరానిది,ధ్యానమునకుమాత్రమేఅందునది,హృదయాంతరాళలోనివాసముండునది,ఆనందాన్ని మాత్రమే ఇచ్చునది , అంతటా అఖండముగా ఉన్న పరబ్రహ్మమే అమ్మగా దివి నుండిభువికివచ్చినారు.
వేదాలు దేనిని గూర్చి చెప్పుచున్నావో, సర్వ గ్రంధాలు ఏదైతే బోధించుచున్నావో, అట్టి బ్రహ్మమును వ్యక్తము చేయుటకూ ప్రతి హృదయంలోనూ దర్శించుటకూ, జీవితాన్ని ఆనందమయం చేయుటకూ ఆ బ్రహ్మమే అమ్మగా వచ్చినారు.
మానవుడి పరమార్ధ స్వరూపమును, ఈ విశ్వం యొక్క రహస్యాన్ని గుర్తించవలసిఉన్నది . ఈ సత్యము తెలియక సంసార దుఃఖంమును అనుభవిస్తూ , జనన మరణాలలో ,తిరుగుతున్నారు . కావున మానవుడు తన యధార్ధ స్వరూపమైన బ్రహ్మమును,శృతి ,యుక్తి ,అనుభవాల ద్వారా గుర్తించవలెను. శృతి యనగా యదార్ధతత్వము , యుక్తి అనగా తన జీవితమునకు తానే అతీతంగా ఉండటం, అనుభవం అనగా ,తాను బ్రహ్మ స్వరూపము అనెడి సత్యము ఆంతర్యంలో గ్రహించుట . ఇట్టి జ్ఞానాన్ని, బ్రహ్మము అమ్మ ప్రసాదించి ఆత్మసాక్షాత్కారమును కలుగజేస్తున్నారు.
అమ్మ చరితం , నామరూప జీవిత గమనం యొక్క చరితం కాదు . అమ్మ, అంతర్లీనంగా ఉన్నట్టి , అవ్యక్తంగా ఉన్నట్టి , తన స్వరూప మూలాన్ని అఖండ బ్రహ్మతత్వాన్ని, బోధిస్తున్నారు. అమ్మ తన నామరూప జీవితాలలో , బ్రహ్మస్థితిని అనుభవిస్తూ , సత్సంగులకు అందిస్తున్నారు. అమ్మ సదా , అనంత ఖాళీలో మునిగి ఉంటారు.ఆ నేత్రాలకు నామరూపాలకన్నా ముందు, అందరి బ్రహ్మ స్వరూపమే కనిపించును. స్వరూపంగా తానుంటూ , స్వరూపాలనే దర్శిస్తూ, స్వరూప జ్ఞానాన్నే బోధిస్తూ, సర్వం బ్రహ్మమయం అను సత్యాన్ని అనుభవింప జేయుచున్నారు.
ధర్మసంస్తాపనార్దాయ సంభవామి యుగేః యుగేః ఇది శ్రీ కృష్ణ పరమాత్మ వచనం.బ్రహ్మ సంస్తాపనార్దాయ సంభవామి హృదే హృదే. ఇది బ్రహ్మముఅమ్మ లక్ష్యం. ప్రతి సాధు జన హృదయాలలో, బ్రహ్మమును దర్శింప జేసి, బ్రహ్మత్వాన్ని ప్రతిష్టించి, తద్వారా శాంతి స్థాపనా చేయుటకు, ఆ బ్రహ్మము యొక్క ఆవిర్భావం జరిగినది. సాక్ష్యాత్తూ ఆ బ్రహ్మమే అమ్మగా వచ్చి , సత్సంగులకు , జీవన్ముక్తిని ప్రసాదించుట జరుగుతున్నది. అమ్మ తన దివ్య వాక్కులతో సరాసరి, సాధకుల హృదయ గ్రంధిని తెరిపించి నీవు అమృత స్వరూపానివని, బ్రహ్మ స్వరూపానివని, వచించి భ్రాంతిని తొలగించి, జనన మరణ చక్రం నుండి విడుదలనిస్తున్నారు.
@ Copyright 2021 – Designed By Mastersteck